వై 7 తెలుగు దినపత్రిక
ఆగస్టు26-08-2024
నిర్మల్ జిల్లా
ఉట్నూర్: ఈనెల 29, 30 తేదీలలో కొమరం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పట్నాపూర్ గ్రామంలో నిర్వహించే సద్గురు శ్రీ ఫూలాజీ బాబా 100వ జన్మదిన మహోత్సవాలకు రావాలని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు నాయకురాలు ఆత్రం సుగుణక్కకు పులాజి బాబా ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందించారు.సోమవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని సుగుణక్క నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన కమిటీ సభ్యులు, ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమాల వివరాలను వివరించారు.అనంతరం కమిటీ సభ్యులతో కలిసి సుగుణక్క పోస్టర్ ను ఆవిష్కరించారు.జయంతి ఉత్సవాలకు హాజరవుతానని సుగుణక్క తెలిపారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కూడే కైలాష్,ముక్కడే విష్ణు,రాము,నాందేవ్ మహారాజ్, భరత్, కొమరంభీం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు కుడ్మేత విశ్వనాధ్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 43