భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,ఆశ్వపురం Y7 న్యూస్ ప్రతినిధి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని మిట్టగూడెం గ్రామంలో ఉన్న తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను (TGTWRDC) బుధవారం ఎన్ ఎస్ యు ఐ అశ్వాపురం మండల అధ్యక్షులు హర్ష సందర్శించి విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని సదుపాయాలు అందుతున్నాయని, గురుకుల సిబ్బంది పిల్లలపై ప్రత్యేక ద్రుష్టి పెట్టి చదివిస్తూ, వారిలో నైపుణ్యాన్ని పెంచాలన్నారు. తరగతి గదులు, వంట గదులు, కంప్యూటర్ శిక్షణ తదితర వాటిని పరిశీలించి, సమస్యలపై విద్యార్థుల దగ్గర నుండి సమాచారం తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి సమస్యలు ఉన్న వెంటనే ఎన్ ఎస్ యు ఐ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల యూత్ కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి నరేష్, శశికాంత్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.