E-PAPER

సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరం

మణుగూరు,ఆగస్టు26 వై 7న్యూస్;
ప్రజలందరూ సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారి డాక్టర్ శివకుమార్ సూచించారు. మండలంలోని అశోక్ నగర్ లో మరియు తొగ్గూడెం లో సోమవారం వైద్య శిబిరం నిర్వహించారు. జ్వరాలు, దగ్గు జలుబు మరియు తీవ్రమైన ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్న వ్యక్తులకి మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రజలకు వైద్య పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు.ఆశాల సహాయంతో ఇంటింటికి తిరిగి జ్వరాలపై సర్వే చేయించారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాలలో శుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నీరు నిలవలు లేకుండా చూసుకోవాలని మరియు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు.ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.ఈ వైద్య శిబిరాలలో డాక్టర్ శివకుమార్, డిప్యూటీ ఆఫీస్ HEO గొంది వెంకటేశ్వర్లు,HV జానకి,హెల్త్ అసిస్టెంట్ ఉమేష్, ఎం.ఎల్.హెచ్.పి హిమ బిందు, వెంకటలక్ష్మి,ఏఎన్‌ఎంలు విజయ లలిత, అనసుర్య,పార్వతి,104 శ్రీకాంత్ మరియు ఆశాలు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News