E-PAPER

న్యాయవాదులకు హెల్త్ కార్డుల పంపిణీ

భద్రాచలం, సెప్టెంబర్ 9 (వై7 న్యూస్): న్యాయవాదుల సంక్షేమం, ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని భద్రాచలం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. భద్రాచలం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శివ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని న్యాయవాదులకు హెల్త్ కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా భద్రాచలం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొడాలి శ్రీనివాసన్ మాట్లాడుతూ, న్యాయవాదుల ఆరోగ్య పరిరక్షణలో హెల్త్ కార్డులు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. న్యాయవాదుల సంక్షేమం కోసం బార్ అసోసియేషన్ పలు కార్యక్రమాలు చేపడుతోందని, అందులో భాగంగానే హెల్త్ కార్డుల పంపిణీ నిర్వహించినట్లు తెలిపారు.

బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పూసాల శ్రీనివాసాచారి మాట్లాడుతూ, న్యాయవాదుల ఆరోగ్య భద్రత, సంక్షేమానికి అసోసియేషన్ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. హెల్త్ కార్డుల ద్వారా సభ్యులకు లభించే ప్రయోజనాలను వివరించారు. భవిష్యత్తులో కూడా న్యాయవాదుల సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే 2019 తర్వాత న్యాయవాదులుగా నమోదు అయిన వారికి ప్రభుత్వం వెంటనే హెల్త్ కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు పాపినేని కృష్ణకుమార్, ఎం.వి. రమణరావు, మాజీ అధ్యక్షుడు కోట దేవదానం, ఇతర సీనియర్, జూనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. హెల్త్ కార్డుల పంపిణీపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!