E-PAPER

గుండెపోటుతో మృతి చెందిన వైసీపీ నేత కాపారపు ఉమ

భౌతికకాయానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి

కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించిన మాజీ ఎమ్మెల్యే

వీఆర్ పురం, సెప్టెంబర్ 10 (Y7 న్యూస్ తెలుగు): పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం వీఆర్ పురం మండలానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాపారపు ఉమ గుండెపోటుతో మృతి చెందారు. బుధవారం సాయంత్రం ఆయనకు హార్ట్ స్ట్రోక్ రావడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఉమ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి మనోధైర్యం కల్పించారు. ఉమ మృతి పార్టీకి, స్థానికంగా పార్టీ శ్రేణులకు తీరని లోటని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మాదిరెడ్డి సత్తిబాబు, వైస్ ఎంపీపీ ముత్యాల గౌతమ్, ఎస్సీ సెల్ నాయకులు గంగులు, జిల్లా అధికార ప్రతినిధి చిక్కాల బాలు, నియోజకవర్గ ఆర్టీఏ విభాగం అధ్యక్షుడు బొడ్డు సత్యనారాయణ, మాజీ సర్పంచ్ పిట్ట రామారావు, మాజీ పార్టీ అధ్యక్షుడు పోడియం గోపాల్, మండల కమిటీ సభ్యులు పండు, మోడెమ్ నరేష్, మండల వైస్ ప్రెసిడెంట్ వడ్డాణపు చిన్న రాజారావు, మండల కమిటీ సభ్యుడు బంధం రాజు, మండల యువజన విభాగం అధ్యక్షుడు బాలు, చింతూరు మండల పార్టీ అధ్యక్షుడు రామలింగా రెడ్డి, జడ్పీటీసీ మురళి, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు కోట్ల కృష్ణ, చింతూరు మండల పార్టీ నాయకులు కారం సాయిబాబా, ధర్ముల విప్లవ్ కుమార్, దేవీపట్నం మండల ఎంపీపీ మురళి, కూనవరం మండల జడ్పీటీసీ గుజ్జా విజయబాబు, నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు నోముల కొండలరావు, కొమ్మని సునీత తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!