E-PAPER

ధరల పెరుగుదలపై సీపీఐ ధర్నా

పలాస, సెప్టెంబర్ 10 (వై7 న్యూస్):
నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజల జీవనం భారంగా మారుతోందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సుందరలాల్ వెంకటరావు అన్నారు.

పలాస మండలం టెక్కలిపట్నం సచివాలయం వద్ద బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో ధరల పెరుగుదలను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సుందరలాల్ వెంకటరావు మాట్లాడుతూ.. ప్రజల ఆదాయాలు పెరగకపోయినా నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయని అన్నారు. దీంతో సామాన్య కుటుంబాలపై ఆర్థిక భారం పెరిగి, అప్పులపాలయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

నిత్యావసర వస్తువుల ధరలను తక్షణమే నియంత్రించి సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నాలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు ఎర్రజెండాలు చేతబూని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!