E-PAPER

ఆనంద్ దేవరకొండతో రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చిన వైష్ణవి చైతన్య

‘బేబీ’ సినిమాతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వీరిద్దరూ కలిసి నటించిన తాజా చిత్రం ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ‘90s’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు పొందిన దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కించిన ఈ యూత్‌ఫుల్ మూవీ సెప్టెంబర్ 11న విడుదల కానుంది.

‘బేబీ’ సినిమాలో ఆనంద్, వైష్ణవి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో.. వీరిద్దరూ నిజ జీవితంలోనూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ గతంలో సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ‘ఎపిక్’లో రిలేషన్‌షిప్‌కు సంబంధించిన బోల్డ్ కంటెంట్, కిస్ సీన్స్ ఉండటంతో ఈ రూమర్స్ మరోసారి తెరపైకి వచ్చాయి. దీంతో వీరి వ్యక్తిగత సంబంధంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

‘ఎపిక్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఆనంద్ దేవరకొండకు ఇదే అంశంపై ప్రశ్న ఎదురైంది. వైష్ణవి చైతన్యతో రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ వచ్చిన వార్తలపై స్పందించిన ఆనంద్.. తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని స్పష్టం చేశాడు. దీంతో ఇప్పటివరకు కొనసాగుతున్న రూమర్స్‌కు ఆనంద్ క్లారిటీ ఇచ్చినట్టైంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!