E-PAPER

పలాసలో ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అవగాహన కార్యక్రమం

పలాస, సెప్టెంబర్ 8 (వై7 న్యూస్): యువతలో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడం, వాటి వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా పలాసలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో మంగళవారం ‘డ్రగ్స్ వద్దు బ్రో’ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న EAGLE సెల్ సభ్యుడు రామచంద్రరావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, డ్రగ్స్ వినియోగం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, మానసిక ఇబ్బందులు తలెత్తడంతో పాటు భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉందని వివరించారు. మాదకద్రవ్యాల బారిన పడకుండా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అలాగే డ్రగ్స్ విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే EAGLE టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని కోరారు. సమాజాన్ని మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!