చింతూరు, (వై7 న్యూస్) ఆగస్టు 02 : ఆదివాసీలు హక్కులు పరిరక్షించాలని సర్వముక అభివృద్ధి సాధించాలని వార్షిక ప్రణాళికలు సమీక్షలో భాగంగా చేపట్టాలని ఐక్యరాజ్యసమితి పిలుపులో భాగంగా ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించాలని ఆదివాసి గిరిజన సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఆదివారం నాడు చింతూరు కేంద్రంలోని ఆదివాసీ గిరిజన సంఘం, ఆదివాసి జేఏసి, ఆదివాసి సంక్షేమ పరిషత్ ముఖ్య నాయకుల సమావేశం జరిగినది ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ప్రతి ఏడాది చింతూరు ఐటీడీఏ పరిధిలో ఆదివాసీ దినోత్సవం నిర్వహణ సాంస్కృతి కళారూపాల ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందని ఆదివాసీల హక్కుల పరిరక్షణ ప్రభుత్వం చేపట్టాలని సుప్రీంకోర్టులో 1/70 సట్టా సవరణ చేయాలని వేసిన పిటిషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీట్ పిటీషన్ వెయ్యాలని 100% ఉద్యోగాలు రిజర్వేషన్ పై ప్రభుత్వం ప్రకటన చేయాలని ఈ సందర్భంగా కోరారు ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామాలలో మరియు విద్యా సంస్థలలో ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీలకు రాజ్యాంగబద్ధంగా 5వ, 6వ షెడ్యూల్ ద్వారా కల్పించిన హక్కులపై అవగాహన కార్యక్రమాలను ఐటీడీఏలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలకు ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని సెలవు దినంగా ప్రకటించి తమ హక్కుల కోసం నినదించే రోజుగా ప్రకటించాలని గత ఏడాది ఆదివాసి దినోత్సవ సందర్భంగా చింతూరు ఐటీడీఏ ప్రాంగణంలో ఆదివాసి అమరవీరుడు బిర్సా ముండా విగ్రహ ప్రతిష్ట నేటికీ పూర్తి చేయలేదని ఈ ఆడదిలోని అయినా విగ్రహ ప్రతిష్ట చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు సీసం సురేష్, జేఏసీ నాయకులు జల్లి నరేష్, ఆదివాసి సంక్షేమ పరిషత్ నాయకులు పోడియం లక్ష్మణ్, సోడే రాఘవ, ఉద్యోగ ఉపాధ్యాయ నాయకులు తిమ్మ సాయి, పండ కృష్ణయ్య, సోడే నారాయణ సోడే మురళి మరియు సవలం భద్రయ్య పద్మావతి ప్రసాదు, తదితరులు పాల్గొన్నారు








