దుమ్ముగూడెం, ఆగస్టు 2 (Y7 న్యూస్ తెలుగు): ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఆగస్టు 9న ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాలని మండల ఆదివాసి సంఘం పిలుపునిచ్చింది. ఈ మేరకు మండల ఆదివాసి సంఘం అధ్యక్షుడు తాటి సత్యనారాయణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
సమావేశంలో ఆదివాసి పెద్దలు, ఉద్యోగులు, సర్పంచులు, యువత పాల్గొని పలు ముఖ్యమైన తీర్మానాలు చేశారు. మండలంలోని ప్రతి ఆదివాసి గ్రామంలో ఆగస్టు 9న ఆదివాసి జెండాను ఎగురవేసి, ఆదివాసుల ఐక్యతను చాటాలని నిర్ణయించారు. అలాగే ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి ఆదివాసుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రదర్శించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసి నాయకులు పోడియం నరేందర్, మాజీ జెడ్పీటీసీ బట్ట విజయగాంధీ, బొర్రా శివయ్య, గనుబోయిన శ్రీను, మెండి భాస్కర్, దానసరి శ్రీను, మాజీ సర్పంచ్ కుర్సం వెంకన్న, సవలం బొజ్జి, కనితి దేవా ప్రసాద్, పోడియం సాంబ, తాటి వెంకటేశ్వర్లు, తాటి రామారావు, బొర్రా సత్యనారాయణ, తాటి చంటి, సోడా వినయ్ పాల్గొన్నారు.
అలాగే ఉద్యోగులు బట్ట హరికృష్ణ, వర్షా వసంతరావు, సున్నం భీమరాజు తదితరులు హాజరై ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
– Y7 న్యూస్ తెలుగు








