E-PAPER

భద్రాద్రి గిరిజన యువకుడికి జాతీయ స్థాయి గుర్తింపు

బెస్ట్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ – 2026″ అవార్డు అందుకున్న రాము కుంజా

హైదరాబాద్, ఆగస్టు 3(వై 7న్యూస్);
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గిరిజన యువకుడు రాము కుంజా అరుదైన ఘనత సాధించారు. తన పట్టుదల, కృషి, సాంకేతిక నైపుణ్యంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆయన.. డిజిటల్ టెక్నాలజీ రంగంలో ప్రత్యేక ముద్ర వేశారు.

గిరిజన కుటుంబంలో జన్మించిన రాము కుంజా ఇంజినీరింగ్ పూర్తి చేసిన అనంతరం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఉద్యోగ జీవితంలో సంపాదించిన అనుభవంతో అనంతరం సొంతంగా eCART Soft Labs Private Limited అనే సాఫ్ట్‌వేర్ సంస్థను స్థాపించారు.

స్టార్టప్‌లు, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు ఎదుర్కొంటున్న వ్యాపార సమస్యలకు ఆధునిక డిజిటల్ పరిష్కారాలను అందిస్తూ eCART Soft Labs ప్రత్యేక గుర్తింపు పొందింది. వ్యాపార ప్రక్రియలను డిజిటలైజ్ చేయడం, ఉత్పాదకత పెంచడం, ఖర్చులను తగ్గించడం, సంస్థల నిర్వహణను మరింత సమర్థవంతంగా మార్చడంలో సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది.

ఈ సేవలకు గుర్తింపుగా Prime Tycoon Media & Tech LLP ఆధ్వర్యంలో నిర్వహించిన Telangana Global Elite Business Awards 2026 కార్యక్రమంలో రాము కుంజాకు “Best Digital Transformation Company of the Year – 2026” అవార్డు అందించారు.

ఈ సందర్భంగా రాము కుంజా మాట్లాడుతూ.. డిజిటల్ టెక్నాలజీని ప్రతి చిన్న వ్యాపారానికి అందుబాటులోకి తీసుకురావడం, స్టార్టప్‌లు మరియు చిన్న, మధ్య తరహా సంస్థలకు ప్రపంచ స్థాయి సాంకేతిక పరిష్కారాలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ అవార్డు సంస్థపై బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులో మరిన్ని వినూత్న సేవలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

ఇదిలా ఉండగా వ్యవసాయ రంగంలో సాంకేతిక విప్లవం తీసుకురావాలనే లక్ష్యంతో రాము కుంజా AagroNexus పేరుతో AI ఆధారిత AgriTech Ecosystemను అభివృద్ధి చేస్తున్నారు.

రైతులు, పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు, వ్యవసాయ నిపుణులను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకువచ్చి వ్యవసాయ రంగాన్ని మరింత లాభదాయకంగా మార్చడమే AagroNexus ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ వేదిక ద్వారా నేల ఆరోగ్య విశ్లేషణ, పంటల ఎంపికపై సూచనలు, తెగుళ్లు, వ్యాధుల గుర్తింపు, సాగు వ్యయ నియంత్రణ, పంట పనితీరు అంచనా వంటి AI ఆధారిత సేవలను అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

పల్లె ప్రాంతం నుంచి వచ్చిన ఓ గిరిజన యువకుడు టెక్నాలజీ రంగంలో సాధించిన ఈ విజయం పట్ల పారిశ్రామికవేత్తలు, ఐటీ నిపుణులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.

పట్టుదల ఉంటే పల్లె నుంచి కూడా ప్రపంచ స్థాయికి ఎదగవచ్చని రాము కుంజా తన విజయంతో మరోసారి నిరూపించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!