మణుగూరు, ఆగస్టు 2 (Y7 News): మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయనను వెంటనే అరెస్ట్ చేసి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా శిక్షించాలని మహిళా కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
మణుగూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మహిళా కాంగ్రెస్ సమావేశంలో మండల అధ్యక్షురాలు కూరపాటి సౌజన్య మాట్లాడుతూ, ఓ యువతిని లైంగికంగా మరియు మానసికంగా వేధించారనే ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని అన్నారు. యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేస్తానని నమ్మించి ఇబ్బందులకు గురిచేయడం, వీడియోలతో బెదిరించారనే ఆరోపణలు వెలుగులోకి రావడం బాధాకరమని పేర్కొన్నారు.
మహిళల ఓట్లతో రెండు పర్యాయాలు ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వ్యక్తి ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోవడం సిగ్గుచేటని ఆమె విమర్శించారు. మహిళల భద్రత కోసం మహిళా కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని, నియోజకవర్గంలో రేగా కాంతారావును తిరగనివ్వబోమని హెచ్చరించారు.
ఈ సమావేశంలో జిల్లా మహిళా కార్మిక శాఖ నాయకురాలు బోగినేని వరలక్ష్మి, చప్పిడి మాధురి, కొలిపాక రమ, వేముల స్వరూప, అందాల శ్యామల, కుంచె పద్మ, కుమ్మరికుంట్ల మౌనిక, ఓదెల రాధిక, మర్రం లక్ష్మి, షేక్ నసీం పర్వీన్, ఇస్లావత్ ద్వాలి, బత్తుల సుజాత తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈ వార్తలో పేర్కొన్న అంశాలు మహిళా కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలు మరియు డిమాండ్ల ఆధారంగా ప్రచురించబడుతున్నాయి. సంబంధిత ఆరోపణలపై అధికారిక దర్యాప్తు కొనసాగుతోంది.








