ఖమ్మం, ఆగస్టు 02 (వై7 న్యూస్):
ఖమ్మం నగరంలోని మయూరి సెంటర్‌లో ఉన్న కెమిస్ట్ భవన్‌లో ఖమ్మం ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ యూనియన్ ఎన్నికలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 167 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
యూనియన్ అధ్యక్ష పదవికి దార్ల మల్లిబాబు, నర్సింగ్ సాయి గణేష్ మధ్య పోటీ నెలకొనగా, జాయింట్ సెక్రటరీ పదవికి గడ్డం శ్రీను, ఎస్.కె. మహమ్మద్ అలీ బరిలో ఉన్నారు. అధ్యక్షుడు, జాయింట్ సెక్రటరీ పదవులు మినహా మిగిలిన అన్ని పదవులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి.
సెక్రటరీగా ఎస్.కె. ఖాసిం పాషా, ట్రెజరర్‌గా పెండ్యాల నాగేశ్వరరావు, చంద్రకాణి నరసింహారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మంలో ప్రతి సంవత్సరం ప్రజాస్వామ్య పద్ధతిలో యూనియన్ ఎన్నికలు నిర్వహించడం విశేషం. సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుని అధ్యక్షుడు సహా కమిటీని ఎన్నుకుంటారు. ఎన్నికల ఫలితాలను అదే రోజు మధ్యాహ్నం ప్రకటించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఎన్నికల నిర్వహణలో ఈసీ సభ్యులుగా సయ్యద్ యాకుబ్ పాషా, తోట సుధాకర్, గింజుపల్లి సుధాకర్, లింగబోయిన శ్రీనివాస్, తాళ్లూరి శ్రీనివాస్ వ్యవహరించారు.








