E-PAPER

ఆగస్టులో స్మార్ట్‌ఫోన్‌ల జోరు.. గూగుల్ పిక్సెల్ 11 సహా కొత్త ఫోన్లు!

స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఆగస్టు 2026 ఎంతో ఆసక్తికరంగా మారనుంది. గూగుల్, వివో, రెడ్‌మి, పోకో, iQOO, ఇన్ఫినిక్స్ వంటి ప్రముఖ బ్రాండ్లు ఈ నెలలో కొత్త స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఫ్లాగ్‌షిప్ మోడళ్ల నుంచి బడ్జెట్, మిడ్‌రేంజ్ ఫోన్ల వరకు పలు కొత్త డివైజ్‌లు విడుదలయ్యే అవకాశం ఉండటంతో మొబైల్ మార్కెట్‌లో సందడి నెలకొననుంది.

ఈ జాబితాలో గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. గూగుల్ తన ‘Made by Google’ ఈవెంట్‌ను ఆగస్టు 12న నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ ఈవెంట్‌లో కొత్త పిక్సెల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు స్మార్ట్‌వాచ్‌ను కూడా పరిచయం చేసే అవకాశం ఉంది. Pixel 11, Pixel 11 Pro, Pixel 11 Pro XL వంటి మోడళ్లు ఈ సిరీస్‌లో ఉండొచ్చని టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అదే సమయంలో గూగుల్ తన తదుపరి తరం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Pixel 11 Pro Foldపై కూడా పనిచేస్తున్నట్లు సమాచారం. ఇతర బ్రాండ్లు కూడా తమ కొత్త మోడళ్లను తీసుకురావడానికి సిద్ధమవుతుండటంతో ఆగస్టులో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మరింత పోటీగా మారే అవకాశం ఉంది. అయితే పలు ఫోన్ల స్పెసిఫికేషన్లు, ధరలు, విడుదల తేదీలకు సంబంధించి అధికారిక ప్రకటనలు వచ్చే వరకు ప్రస్తుతం ఉన్న సమాచారాన్ని అంచనాలుగానే పరిగణించాలి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!