E-PAPER

విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యం.. తల్లిదండ్రులతో ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం సమావేశం

దుమ్ముగూడెం, జూలై 18 (Y7 న్యూస్ తెలుగు);

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం రాజుపేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై విద్యారంగంలో ముందుకు సాగాలని కోరుతూ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె. సాయమ్మ ఆధ్వర్యంలో తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, చదువుపై ఆసక్తి, పాఠశాలలో అందుతున్న విద్యా బోధన, పిల్లల భవిష్యత్ లక్ష్యాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. పిల్లల చదువులో తల్లిదండ్రుల సహకారం ఎంతో ముఖ్యమని ఉపాధ్యాయులు సూచించారు.

ఈ సమావేశంలో పాఠశాల సిబ్బంది ఎస్. లక్ష్మి తదితరులు పాల్గొని విద్యార్థుల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

మారుమూల పల్లెటూరిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని రాజుపేట గ్రామస్థులు అభినందిస్తున్నారు. విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న పాఠశాల యాజమాన్యాన్ని స్థానికులు ప్రశంసించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News