బూర్గంపాడు:
నేటి సాయంత్రం ఒడిశా రాష్ట్రం నుండి ములుగు జిల్లా, మంగపేట మండలానికి బజాజ్ పల్సర్ బైక్పై అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
సారపాక పల్లె ప్రకృతి వనం సమీపంలో ఎస్సై ప్రసాద్ తన సిబ్బందితో కలిసి నిర్వహించిన తనిఖీల్లో, సుమారు 2.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.1,05,000/-గా ఉంటుంది.
పట్టుబడిన వ్యక్తుల వివరాలు:
బడే భరత్, 20 సంవత్సరాలు
ఉప్పరపల్లి వెంకటేష్, 26 సంవత్సరాలు, నివాసం: మంగపేట మండలం, ములుగు జిల్లా
స్వాధీనం చేసుకున్నవి:
2.1 కిలోల గంజాయి
ఒక బజాజ్ పల్సర్ బైక్
2 మొబైల్ ఫోన్లు
ఇట్టి వ్యక్తులపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించడం జరిగినది.
Post Views: 10








