E-PAPER

నువ్వలరేవులో రెవెన్యూ సదస్సు.. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే గౌతు శిరీష సూచనలు

శ్రీకాకుళం :

శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలోని వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో గౌతు శిరీష జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్‌తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజల నుంచి వచ్చిన రెవెన్యూ సంబంధిత సమస్యలు, భూ వివాదాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, భూముల రికార్డులు తదితర అంశాలకు సంబంధించిన వినతులను అధికారులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే గౌతు శిరీష అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా అందించడమే ఇటువంటి రెవెన్యూ సదస్సుల ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే తెలుసుకొని వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.

ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం.

ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి” అని ఎమ్మెల్యే గౌతు శిరీష పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News