E-PAPER

24 ఏళ్లకే పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలకు తల్లి అయిన స్టార్ హీరోయిన్.. కెరీర్ ముగిసిపోతుందన్నా వినకుండా..!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ స్ప్యాన్ చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హోదాలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నా, పిల్లలను కన్నా కెరీర్ ముగిసిపోతుందనే భయం చాలా మందిలో ఉంటుంది. కానీ, ఒక స్టార్ హీరోయిన్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన మనసుకు నచ్చినట్లు జీవించింది. కేవలం 24 ఏళ్ల వయసులోనే, అదీ పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలకు తల్లి అయి అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇండస్ట్రీ పెద్దలు, సన్నిహితులు వారించినా వినకుండా ఆమె తీసుకున్న నిర్ణయం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది.

ఆ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న నటి మరెవరో కాదు.. బాలీవుడ్ మాజీ విశ్వసుందరి, స్టార్ హీరోయిన్ సుస్మితా సేన్. ‘దస్తక్’ సినిమాతో హిందీ చిత్రసీమలో అడుగుపెట్టిన సుస్మిత.. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు సమాజం ఏం అనుకుంటుందో అని ఆలోచించకుండా ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. 2000 సంవత్సరంలో కేవలం 24 ఏళ్ల వయసులోనే ‘రినీ’ అనే ఆడపిల్లను దత్తత తీసుకుని సింగిల్ మదర్‌గా మారింది. ఆ తర్వాత 2010లో ‘అలీషా’ అనే మరో ఆడపిల్లను కూడా దత్తత తీసుకుని ఇద్దరు పిల్లల బాధ్యతను ఒంటరిగానే స్వీకరించింది.

ఆ రోజుల్లో పెళ్లి కాకుండా ఒక ఒంటరి మహిళకు దత్తత ఇచ్చేందుకు చట్టపరమైన ఇబ్బందులు ఎదురైనా, కోర్టుల చుట్టూ తిరిగి మరీ ఆమె పోరాడి విజయం సాధించింది. పిల్లల కోసం తన సినిమా అవకాశాలు తగ్గుతాయని తెలిసినా ఆమె వెనకడుగు వేయలేదు. ప్రస్తుతం ఆ ఇద్దరు కుమార్తెలు పెద్దవారయ్యారు. సుస్మితా సేన్ తీసుకున్న ఈ నిర్ణయం అప్పట్లో ఎందరికో స్ఫూర్తినిచ్చింది. పెళ్లి అనే బంధంతో సంబంధం లేకుండా, మాతృత్వానికి ఉన్న అసలైన అర్ధాన్ని చాటిచెప్పిన సుస్మిత.. నేటికీ ఎందరో మహిళలకు రోల్ మోడల్‌గా నిలుస్తోంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!