వై 7 న్యూస్ పలాస
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శనివారం అక్కుపల్లి జంక్షన్, కాశీబుగ్గ బస్టాండ్, నెహ్రూ పార్క్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చలివేంద్ర కేంద్రాలను ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… జంట పట్టణాలకు వివిధ అవసరాల నిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు తీవ్ర ఎండలో ఇబ్బందులు పడుతున్నారని, వారికి తాగునీరు అందించేందుకు ఈ చలివేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. వేసవి కాలంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, వజ్జ బాబూరావు, లోడగల కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 18








