E-PAPER

రైతు ఉత్సవంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం – కాంగ్రెస్ నాయకుల సంబరాలు

వై 7 న్యూస్ మణుగూరు:
మణుగూరు మండలంలోని గుట్టమల్లారం రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమం సందర్భంగా ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం, రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని వీక్షించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సేవలను కొనియాడుతూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రైతుల పక్షపాతి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని నాయకులు తెలిపారు.

మణుగూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పీరినాకి నవీన్ మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. రైతు భరోసా నిధుల విడుదలతో రైతులకు ఆర్థికంగా ఉపశమనం కలిగిందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ శివాలయం చైర్మన్ కూచిపూడి బాబు, గుట్టమల్లారం సర్పంచ్ కారం పూజిత, తిర్లాపురం సర్పంచ్ పాయం చిట్టెమ్మ, విప్పాలసింగారం పాల్వంచ రాములు, కట్టుమల్లారం జగిడి ప్రసాద్, వైస్ సర్పంచ్‌లు కొమరం మధుకిరణ్, గాండ్ల సురేష్, గోరట్ల కనకయ్య, వార్డు సభ్యులు, మహిళా నాయకులు, జిల్లా స్థాయి ప్రతినిధులు, రైతు సంఘ నాయకులు, రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై సంతోషం వ్యక్తం చేస్తూ రైతులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!