ఐఏఎస్ గోపాలకృష్ణతో భేటీ
పలాస:
పలాస నియోజకవర్గంలోని పి.హెచ్. సి., సి. హెచ్. సిల్లోని పలు సమస్యలను ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ రోణ ంకి గోపాలకృష్ణ దృష్టికి పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తీసుకెళ్లారు. సచివాలయంలోని ఆయన కార్యాలయంలో బుధవారం పలాస ఎమ్మెల్యే భేటీ అయ్యారు. ప్రభుత్వ వైద్యాశాలలను మరింత పటిష్టం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆయన సానుకూలంగా స్పందించి, పలాస నియోజకవర్గంలోని ఆస్పత్రుల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, ఐఏఎస్ గోపాలకృష్ణ స్వస్థలం పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలోని పారసంబ కావడం గమనార్హం.
Post Views: 11








