E-PAPER

దొంగతనం కేసులో ఇద్దరు యువకుల అరెస్ట్

నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం

Y7 News Telugu పలాస:
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. గత నెల రోజులుగా చోటుచేసుకున్న నాలుగు ద్విచక్ర వాహనాల దొంగతనాలను విచారణలో భాగంగా పోలీసులు అన్వేషిస్తుండగా, ఆదివారం వాహనాల తనిఖీల సందర్భంగా నిందితులు పోలీసుల చెరలో పడ్డారు.

కాశీబుగ్గ సీఐ పి. సూర్యనారాయణ వివరాల ప్రకారం,
అరెస్టు చేసిన నిందితులు శ్రీకాకుళం జిల్లా నివాసితులు. వీరిద్దరి పేర్లు భూసార లక్ష్మణరావు, పిండ్రాల చిన్న తెరిపారు. ప్రాథమిక విచారణలో నిందితులు పలాస–కాశీబుగ్గలో నాలుగు బైక్స్‌ను దొంగిలించినట్టు ఒప్పుకున్నారు.

ఇంతకుముందు కూడా వీరు శ్రీకాకుళంలోని ఓ ఇంట్లో 5 తులాలు వెండి, బొబ్బిలిలో మరో ఇంట్లో 12 తులాలు బంగారం దొంగతనం చేసినట్టు విచారణలో వెల్లడించారు.
ప్రస్తుతం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు.

ఈ మీడియా సమావేశంలో కాశీబుగ్గ ఇంచార్జ్ డీఎస్‌పీ లక్మణమూర్తి, సీఐ సూర్యనారాయణ పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News