పలాస, నవంబర్ 19: రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. బుధవారం మందస మండలం భోగాపురం గ్రామంలో నిర్వహించిన పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ,చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చాక రైతును రాజుగా చూడాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం. ఈ పథకం కింద నేడు 7,000 మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి
అని పేర్కొన్నారు.పలాస నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు 29,748 మంది రైతులకు రూ.1,959 కోట్లు జమ చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
Post Views: 43









