అన్నపురెడ్డిపల్లి మండలంలో పలు ప్రభుత్వ కార్యాలయాలకు వినతిపత్రాల సమర్పణ
అన్నపురెడ్డిపల్లి:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో రహదారుల దుస్థితిపై భీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు మండలంలోని పెనగడప–అన్నపురెడ్డిపల్లి ప్రధాన రహదారికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ, భీఆర్ఎస్ మండల అధ్యక్షులు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు, మండల అధ్యక్షుడు బొయనపల్లి సుధాకర్‌రావు సూచనలతో పలు కార్యాలయాలకు వినతిపత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో భీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు కొత్తూరు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో, అన్నపురెడ్డిపల్లి ఎంపీడీవో కార్యాలయంలో యుడిసికి వినతి పత్రం సమర్పించారు. రహదారి గుంతలు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని నాయకులు విమర్శించారు. రహదారుల అభివృద్ధి టీఆర్ఎస్ పాలనలోనే జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెనగడప–అన్నపురెడ్డిపల్లి రహదారిని అత్యవసరంగా మరమ్మతులు చేసి, అభివృద్ధి పనులను అరటికాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భారత రాంబాబు, చల్లా రాంబాబు, రాఘవులు, జంగాల ఉమా, ఇనపనూరు రాంబాబు, చల్లా రమేష్, లాకావత్ సత్యనారాయణ, గుడిమెట్ల శ్రీకాంత్, ఓరగంటే హుస్సేన్ తదితర భీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









