E-PAPER

పలు కార్యక్రమాలకు హాజరై బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చిన కుంజా సూర్య

ములుగు జిల్లా:
ములుగు జిల్లాలో పలు కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రజలకు మరింత చేరువైన కాంగ్రెస్ నాయకుడు కుంజా సూర్య ఈరోజు పలు గ్రామాల్లో జరిగిన పరామర్శ కార్యక్రమాలకు హాజరయ్యారు. జిల్లా ప్రజల మంచి–చెడుల్లో భాగస్వామ్యం కావాలని, వారి బాధల్లో తోడు నిలవాలని సంకల్పంతో సూర్య గారు వరుసగా కుటుంబాలను పరామర్శించారు.

రాయినిగూడెం (కొత్తూరు) గ్రామ మాజీ సర్పంచ్ కల్తీ సమ్మయ్య గారు మరణించడంతో, వారి పార్థివదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెబుతూ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

తదుపరి, కన్నాయిగూడెం గ్రామానికి చెందిన దనుసరి సమ్మక్క గారు ఇటీవల మరణించడంతో సూర్య గారు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధితులకు ఆర్థిక సహాయం అందిస్తూ, తాము ఎల్లప్పుడూ వారి పక్కన ఉంటామని తెలిపారు. కుటుంబానికి అవసరమైన సమయంలో ప్రభుత్వం సహాయం అందేలా చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమాల్లో నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మారం సుమన్ రెడ్డి, ములుగు మండల అధ్యక్షుడు చాంద్ పాషా, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల భరత్ కుమార్, జిల్లా యూత్ కార్యదర్శి నేపాల్ రావు, మండల యూత్ అధ్యక్షుడు కుక్కల నాగరాజు, యూత్ ఉపాధ్యక్షుడు కాసర్ల రాజు, యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ బండి మధు, జిల్లా యూత్ నాయకులు అప్పిడి మహిపాల్ రెడ్డి, మేకల రాజేష్, తిరుపతి (మొండయ్య) తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!