E-PAPER

గిరిజన గోత్తికోయ కుటుంబాలకు చీరల పంపిణీ

దానధర్మ ట్రస్ట్ గంటా రాధ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం

అశ్వాపురం, నవంబర్ 7:
అశ్వాపురం మండల పరిధిలోని కుమ్మరిగూడెం గ్రామంలో గిరిజన ఆదివాసి (గోత్తికోయ) జాతికి చెందిన సుమారు 50 కుటుంబాలకు దానధర్మ ట్రస్ట్ చైర్మన్ గంటా రాధా ఆధ్వర్యంలో చీరలు, హాట్ బాక్సులు పంపిణీ చేశారు.

చీరల పంపిణీ అనంతరం స్వచ్ఛంద సేవలో భాగంగా గ్రామ పరిసరాల్లో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని శుభ్రపరచడం జరిగింది.

ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ గంటా రాధా మాట్లాడుతూ,
ఆదివాసి గిరిజన గోత్తికోయ గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ గిరిజన సోదరుల కష్టసుఖాలను దగ్గరగా చూశాక నా మనసు కలచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా వీరి సమస్యలను గుర్తించి కరెంటు లైన్లు, రహదారులు వేయాలి,” అని ఆకాంక్ష వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కుమ్మరిగూడెం గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News