పలాస :
నవంబర్ 9, 2025 ఆదివారం నాడు పలాస మండలం చినంచల గ్రామంలో వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం లో భాగంగా రచ్చబండ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమాన్ని జిల్లా అధికార ప్రతినిధి B.D. Rao స్వగ్రామంలో ఏర్పాటు చేయగా, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు హాజరై మాట్లాడారు.
ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్యాయ విధానాలను ఖండిస్తూ ప్రజా ఉద్యమానికి ఊతమిచ్చారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని, వైఎస్సార్సీపీ ప్రజా బాటలో ఏకమై నినాదాలు చేశారు.
కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
Post Views: 51









