కరకగూడెం, నవంబర్ 7
రిపోర్టర్: కటకోజ్వాల దిలీప్ | వై7 న్యూస్ తెలుగు
కరకగూడెం మండల కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో డిజిటల్ క్యాంపెయినింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు నిర్వహించబడింది.
ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రావుల సోమయ్య మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనుల్లో విఫలమైందని, ప్రజలతో చెలగాటం ఆడుతోందని తీవ్ర విమర్శలు గుప్పించారు.
బయ్యారం–తాడ్వాయి ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్లపై ఏర్పడిన గుంతలను డీఎంఎఫ్‌టీ, సిఎస్ఆర్ నిధుల ద్వారా వెంటనే మరమ్మత్తులు చేయాలని జిల్లా మంత్రులను బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది.
రావుల సోమయ్య హెచ్చరిస్తూ,రోడ్ల పరిస్థితిని తక్షణమే సరిచేయకుంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతాం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొమరం రాంబాబు, అక్కిరెడ్డి వెంకటరెడ్డి, రేగా సత్యనారాయణ, బైరిశెట్టి చిరంజీవి, పోగు వెంకటేశ్వర్లు, బుడగం రాము, గుడ్ల రంజిత్, అత్తె సత్యనారాయణ, మాజీ సర్పంచులు ఊకే రామనాథం, పాయం నరసింహారావు, కొమరం విశ్వనాథం, భూక్య అర్జున్, గొగ్గల నారాయణ, నిట్టా ఏడుకొండలు, పఠాన్ యాకూబ్ ఖాన్, గుమ్మడివెళ్లి ప్రసాద్, యలగొండ శ్రీను, తోలెం రామారావు, దాసరి సాంబయ్య, సోషల్ మీడియా మండల అధ్యక్షులు సిద్ధి సునీల్, గుర్రం లాలు తదితరులు పాల్గొన్నారు.









