E-PAPER

మణుగూరులో ఆగస్టు 12న కొమరం భీమ్ విగ్రహ ప్రతిష్ఠ

మణుగూరు, ఆగస్టు 10 (వై 7 న్యూస్):

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం చిక్కుడుగుంట గ్రామం, BTPS మెయిన్ గేట్ సమీపంలో గోండు అమరవీరుడు కొమరం భీమ్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఆగస్టు 12 మంగళవారం ఉదయం 11 గంటలకు ఘనంగా జరగనుంది.

మణుగూరులోని డివి గ్రాండ్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే & మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చందా లింగయ్య దొర మాట్లాడుతూ, “ఆదివాసీ గర్వతిలకమైన కొమరం భీమ్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రతి ఆదివాసీ మనసులో గౌరవం, స్ఫూర్తి నింపే వేడుక అవుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలి” అని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమాన్ని BTPS ఆదివాసీ ఉద్యోగులు, BTPS భూ నిర్వాసితుల కమిటీ, జాతీయ ఆదివాసీ గిరిజన అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి ధనసరి అనసూయ (సీతక్క) ముఖ్య అతిథిగా హాజరై విగ్రహ ఆవిష్కరణ చేస్తారని తెలిపారు.

సభాధ్యక్షులుగా;

మాజీ ఎమ్మెల్యే & మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చందా లింగయ్య దొర

పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

ప్రజా ప్రతినిధులు, మాజీ శాసన సభ్యులు, జాతీయ ఆదివాసీ అఖిల పక్ష ప్రజా సంఘాలు, ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి, యువజన, మేధావులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆహ్వాన కమిటీ కోరింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News