చర్ల ఆగస్టు 1 వై 7 న్యూస్;
బాల్య మిత్రుడు సిద్ధి రాజేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని మిత్రులు లక్ష్మీనరసింహ రెడ్డి విజయ్ అరుణ్ బాబు లు గవర్నమెంట్ హాస్పటల్ కు బీపీ మిషన్ ను వితరణ గా అందజేశారు. గత కొద్ది రోజులుగా హాస్పటల్ నందు బీపీ మిషన్ లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని మిత్రుడి జన్మదిన సందర్భంగా రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బీపీ మిషన్ ను వితరణ గా అందించడం జరిగిందని మిత్రుడు లక్ష్మీ నరసింహ రెడ్డి తెలిపారు. యువత పుట్టినరోజు పెళ్ళి రోజు అంటూ వృధా ఖర్చు చేయకుండా సమాజ సేవకు ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయి వర్ధన్ డాక్టర్ పెద్దాడ గీతానంద పార్వతి కాంత్ సీనియర్ జర్నలిస్ట్ బొబ్బిలిపాటి రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 25