E-PAPER

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఐఎన్టియుసి శ్రేణులు చురుగ్గా పాల్గొనాలి

మంత్రి శ్రీనివాస్ రెడ్డి అండదండలతో ముందుకు సాగాలి

రాష్ట్ర ప్రభుత్వ పథకాలను విస్తృత ప్రచారం చేయాలి

ఐఎన్టియుసి కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్

కొత్తగూడెం సింగరేణి, ( )= త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఐఎన్టియుసి శ్రేణులు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులతో కలిసి చురుగ్గా పాల్గొనాలని ఐఎన్టియుసి కొత్తగూడెం ఏరియా ఉపాధ్యక్షులు ఎండి రజాక్ పిలుపునిచ్చారు. ఆదివారం విద్యానగర్ కాలనీలోని రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆళ్ల మురళి సూచనలతో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి ప్రచారం చేసే విధంగా యూనియన్ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్న పిలుపునిచ్చారు. ఐఎన్టియుసి కి చెందిన కాంట్రాక్ట్ కార్మికులు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని, కష్టపడి పనిచేసి పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని దానికి మీరందరూ కలిసి పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత ప్రచారం చేయాలని కోరారు. అభివృద్ధిలో జిల్లాను పరుగులు పెట్టిస్తున్న పొంగులేటి శీనన్న మనకు అండగా ఉంటాడని స్థానిక యుద్దానికి అందరు సిద్ధంగా ఉండాలని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News