ధర్మాన కృష్ణదాస్ సంఘీభావం.. నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్
పలాస, ఆగస్టు 7 (వై7 న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలాసలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు.
మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు సతీమణి శ్రీదేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి హాజరై సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డీఎస్సీ నిర్వహణలో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరగాలంటే డీఎస్సీ ప్రక్రియపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్‌సీపీ అధినేత ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ధర్మాన కృష్ణదాస్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








