హైదరాబాద్, జూలై 20 వై 7 న్యూస్;
ప్రఖ్యాత రోబో మైండ్స్ స్కూల్ లో ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆధ్యాత్మికతతో ఆవిర్భవించిన ఈ వేడుకలో చిన్నారులు అమ్మవార్ల వేషధారణలో మెరిశారు. రంగురంగుల వస్త్రాలు ధరించి తలపై బోనాలు మోస్తూ విద్యార్థులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా కరస్పాండెంట్ ఆర్. అలేఖ్య మాట్లాడుతూ ,బాల్యంలోనే మన సంప్రదాయాలను, సంస్కృతిని పరిచయం చేయాలనే లక్ష్యంతో ఈ వేడుకను ఏర్పాటు చేశాం. పిల్లల్లో భక్తి భావన పెంచేలా కార్యక్రమాలు రూపొందించాం అని తెలిపారు.
పండుగకు హాజరైన తల్లిదండ్రులు, అతిధులు పిల్లల ప్రదర్శనలతో మంత్ర ముగ్ధులయ్యారు. బోనాలు, కొలాటాలు, పాటలు, నృత్యాలతో విద్యార్థులు అమ్మవారికి తమ భక్తిని అర్పించారు. అంతటా ఉత్సాహం, ఉల్లాసం, భక్తి శ్రద్ధల వాతావరణం నెలకొంది.
Post Views: 128