E-PAPER

ఆర్థిక సాయం అందించిన ప్రజా సేవకుడు గురిజాల గోపి

మణుగూరు,జూలై 21 వై 7 న్యూస్;

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మణుగూరు పట్టణానికి చెందిన ప్రముఖ రిపోర్టర్లు దోనికేన శ్రీను, ప్రేమ్ కుమార్ గార్ల తండ్రి అయిన దోనికేన రాజమౌళి జూలై 17, 2025న అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ వార్త తెలుసుకున్న స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలో మణుగూరు కాంగ్రెస్ పార్టీ రేణుక చౌదరి క్యాంప్ కార్యాలయం తరఫున జిల్లా స్థాయి నాయకుడు గురిజాల గోపి రాజమౌళి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. ఆయన అధ్యక్షతన రేణుక అక్షర మహిళా మండలి సభ్యులు కూడా కుటుంబ సభ్యులను కలిసి వారి బాధను పంచుకున్నారు. మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన అనంతరం, పెద్దకర్మ కార్యక్రమానికి గాను ఆర్థిక సహాయాన్ని నగదు రూపంలో అందించారు.

ఇది పరామర్శ కాదని, మనుషులుగా మన బాధ్యతను నెరవేర్చే ప్రయత్నమని గురిజాల గోపి వ్యాఖ్యానించారు. సుఖంలో తోడు ఉండడం సులభం, కానీ దుఃఖంలో బలం కలిగించడం నాయకత్వంలో నిజమైన గుణమని ఆయన స్పష్టం చేశారు.

సమాజంలో సేవా దృక్పథంతో ముందుండే నాయకులు విలువైన మార్గదర్శకులుగా నిలుస్తారని, గురిజాల గోపి అందించిన ఆర్థిక సహాయం మానవతా విలువలకు నిదర్శనమని మణుగూరు వాసులు అభిప్రాయపడుతున్నారు.

ఈ కార్యక్రమంలో రేణుక అక్షర మహిళా మండల అధ్యక్షురాలు పూనెం సరోజ, మహిళా సీనియర్ నాయకురాలు ఎండీ షబానా, ఉపాధ్యక్షురాలు బొడ్డు సౌజన్య, జనరల్ సెక్రటరీ రెడ్డీబోయిన రేణుక, నాంపల్లి రమణ, కన్నారపు వసంత, డేరంగుల సుజాత, భవాని తదితరులు పాల్గొన్నారు.

.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్