మణుగూరు,జూన్14 వై 7 న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రేగులగండి గ్రామంలో శనివారం ఉదయం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పిడుగుపాటుకు గురై కుంజ జగన్ (వయసు 40) మృతి చెందాడు.ఆయన తండ్రి పేరు ఉంగయ్య, భార్య దేవి, వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. స్థానికులు మృతుని కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. అధికారుల స్పందన కోసం గ్రామస్థులు వేచి చూస్తున్నారు.
Post Views: 58









