E-PAPER

కలెక్టర్ కార్యాలయానికి కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు సరఫరా కోసం ధరఖాస్తులు ఆహ్వానం

భద్రాద్రి కొత్తగూడెం, మే 28(వై 7న్యూస్)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయము, కంప్యూటర్లు మరియు అనుబంధ ఉపకరణాల సరఫరా కొరకు జిల్లా కొనుగోలు కమిటీ (DPC) ఆధ్వర్యంలో అర్హత కలిగిన సరఫరాదారులు మరియు ఫర్ముల నుండి ధరఖాస్తులను కోరుతోంది.

ఈ ప్రకారం, 58 యూనిట్ల డెస్క్‌టాప్ కంప్యూటర్లు (Intel i5 6th Gen Processor, 500GB SSD, 8GB DDR4 RAM, Samsung 19″ LED Monitor మొదలైనవి), 55 యూనిట్ల HP Laser Jet Pro 4004D డుప్లెక్స్ ప్రింటర్లు, 55 యూనిట్ల Numaric 1000VA UPSలు మరియు 5-30 యూనిట్ల Canon DRC 230 డాక్యుమెంట్ స్కానర్లు అవసరం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇవన్నీ సరఫరా చేయుటకు లైసెన్సు కలిగిన ఫర్ములు తమ కొటేషన్లు లేదా దరఖాస్తులను అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), IDOC కార్యాలయం, గది సంఖ్య F-17, భద్రాద్రి కొత్తగూడెం నందు తేదీ 28.05.2025 ఉదయం 10.30 గంటల నుండి 30.05.2025 సాయంత్రం 05.00 గంటల లోపు సమర్పించాల్సినదిగా అధికారులు సూచించారు.

స్వీకరించిన ధరఖాస్తులు తేదీ 31.05.2025 ఉదయం 11.00 గంటలకు అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) ఛాంబర్‌లో DPC ఆధ్వర్యంలో తెరవబడనున్నాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News