రాష్ట్ర ప్రభుత్వానికి కానరాని విద్యా వ్యవస్థ
తెలంగాణకు విద్యాశాఖ మంత్రి కేటాయించాలి
ఇష్టానుసారంగా పలు కేజీబీవీ పాఠశాలలు
ఈమధ్య కాలంలో పలుచోట్ల ఎలుక దాడులైన పట్టించుకుని రాష్ట్ర ప్రభుత్వం
చుండ్రుగొండ గిరిజన ఆశ్రమ పాఠశాలలో పి ఈ టి (వ్యాయామ ఉపాధ్యాయురాలు)ని నియమించాలి
పలు హాస్టల్లో సందర్శించిన ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోత్ వంశీ
చండ్రుగొండ ఫిబ్రవరి16 వై సెవెన్ న్యూస్
చుండ్రుగొండ మండల కేంద్రంలోని పలు హాస్టలను మరియు పాఠశాలను సందర్శించిన ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలలో స్కూల్ బిల్డింగ్ సరిపోక విద్యార్థుల అవస్థలు పడుతున్నారని అన్నారు పైన పెచ్చులు ఎప్పుడు పడతాయో తెలియని విధంగా ఉందని విద్యార్థులు భయాందోళన గురవుతున్నారు అన్నారు. అదేవిధంగా మండల కేంద్రంలో ఉన్న కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులపై ఎలుకల దాడి చేసిన విషయం తెలిసిందే సిబ్బందితో మాట్లాడే విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కేజీబీవీ చంద్రుగొండలో ఇష్టానుసారంగా నడుస్తుందని అన్నారు. అదేవిధంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో పిటి టీచర్లను నియమించాలని అన్నారు బెంచీలు ఏర్పాటు చేయాలి. విద్యార్థులు లోపల ఉంటే బయట కోతులు వచ్చి కరుస్తున్నాయని విద్యార్థులు తెలియజేశారు. సరిపడా మరుగుదొడ్డు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో జిల్లావ్యాప్తంగా అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వంని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు సాయి తేజ,రామ్ , హేమంత్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.