E-PAPER

వన్ టౌన్ స్టేషన్ సిబ్బంది పనితీరు భేష్;డీఎస్పీ రాజశేఖర్ రాజ్

వై7 న్యూస్ తెలుగు దినపత్రిక

మిర్యాలగూడలో వార్షిక తనిఖీలలో భాగంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ను సందర్శించిన డీఎస్పీ రాజశేఖర్ రాజ్. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ పోలీస్ కిట్టులు, కేసు రికార్డులను పరిశీలన,కేసుల పరిష్కారంలో వన్ టౌన్ స్టేషన్ సిబ్బంది పనితీరు మెరుగ్గా ఉంది. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి.రోడ్లపైకి వచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవు.డీజే ఏర్పాట్లకు ఎలాంటి అనుమతులు లేవు.వేడుకలలో భాగంగా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లా ఎస్పీ ఆదేశాలతో 31న తనిఖీలు చేపడతాం.ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, మిగతా అన్ని షాపుల వారు కూడా మూసివేయాలి లేనియెడల కట్టిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు పూర్తిగా పోలీస్ సిబ్బందికి సహకరించాలి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్