E-PAPER

సమగ్ర శిక్ష (SSA) ఉద్యోగుల సమ్మె వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు

ప్రభుత్వం సమ్మెను విరమింప చేసి,వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి

ఎం పవన్ చౌహన్ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు

చుండ్రుగొండ డిసెంబర్ 29 వై 7 న్యూస్;
రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, వారితో చర్చలు జరిపి వారి సమ్మెను విరమింపజేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతూ వంశీ ప్రభుత్వాన్ని ఒక ప్రకటన లో కోరారు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు..ఇంచార్జి లచే
తాత్కాలిక బోధన,కేజీబీవీల పర్యవేక్షణల వల్ల విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నరని,కేజీబీవీలపై అవగాహన లేని వారిని ఇంచార్జి లుగా నియమిస్తే విద్యార్థులు అన్ని విధాలుగా నష్టపోతారని ఆయన అన్నారు..దీనిపైప్రభుత్వం పునరాలోచించాలని వెంటనే స్పందించి విద్యార్థులు రోడ్లు ఎక్కకుండా చూసుకోవాలన్నారు..అలాగే సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి,వారిని రెగ్యులరైజ్ చేయాలని,వారిని విద్యా శాఖలో విలీనం చేసి,అన్ని బెనిఫిట్స్ అందేలా చూడాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిదేనని,ప్రజాపాలనలో నూతన ప్రభుత్వం పై తిరుగుబాటు జరగకుండా చూసుకోవాలని హితవు పలికారు.విద్యార్థులు ఇబ్బందులు పడితే మాత్రం విద్యార్థి సంఘాలుగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో విద్యార్థులతో కలిసి పాల్గొని వారి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్