E-PAPER

భార్యను అడవిలో వదిలి వెళ్లిన భర్త!

తెలంగాణ,

సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి అడవిలో ఓ యువతిని వదిలివెళ్లాడు ప్రబుద్ధుడు. మహారాష్ట్రకు చెందిన విక్రమ్‌ మన్వర్‌ ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉంటున్నాడు. అక్కడ రబియా అనే యువతితో పరిచయం ఏర్పడటంతో కలిసి ఉంటూ ఈనెల 4న పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి.హైదరాబాద్ కు వచ్చాక శనివారం మళ్లీ గొడవ జరగడంతో రబియా పెయిన్‌ కిల్లర్‌ మాత్రలు మింగింది. దీంతో విక్రమ్‌ ఆమెను తీసుకొచ్చి అడవిలో వదిలి వెళ్లాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని రుబియాను ఆస్పత్రికి తరలించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్