E-PAPER

భవన నిర్మాణ కార్మికులకు విశేష సేవలు అందిస్తున్న జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్

హైదరాబాద్ డిసెంబర్ 13 వై సెవెన్ న్యూస్;

జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్రంలోని అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులకు అనేక సేవలు అందిస్తోందని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ పేర్కొన్నారు. జేఎస్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గోలుకొండ రత్నం, కార్యదర్శి మాటూరి కృష్ణ మోహన్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కమిషన్ నుంచి కొత్త లేబర్ కార్డులు ఇప్పించడం, కార్డుల రెన్యువల్, బాధితులకు క్లెయిమ్ లు ఇప్పించడం వంటి పలు సేవలు అందిస్తున్నారు. శుక్రవారం నాడు హైదరాబాద్లోని మెట్టు గూడ లో ఉన్న జై స్వరాజ్ పార్టీ కార్యాలయంలో మల్కాజిగిరికి చెందిన బిక్షపతి అనే భవన నిర్మాణ కార్మికుడు జేఎస్టీయూసీ నాయకులను కలిసి సమస్యలను వివరించారు. ఇటీవల ఒక భవన నిర్మాణ పనిలో ఉండగా కర్ర విరిగి కింద పడటంతో ఒక కాలు ఇరగడంతో పాటు నడుము మీద తీవ్ర గాయాలయ్యాయని, తనకు లేబర్ కమిషన్ నుంచి పరిహారం ఇప్పించాలని గోలుకొండ రత్నంకు వివరించారు. వెంటనే ఆ ప్రక్రియకు సంబంధించిన దరఖాస్తు తయారు చేసి లేబర్ కమిషన్ లో సమర్పించి పరిహారం ఇప్పిస్తామని గోలుకొండ రత్నం చెప్పారు. పార్టీ చేస్తున్న సేవలకు స్పందించిన భిక్షపతి జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ చేతుల మీదుగా కండువా కప్పుకుని పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జై స్వరాజ్ పార్టీ జాతీయ కార్యదర్శి ఆర్ ఎస్ జే థామస్, జేఎస్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి మాటూరి కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్