మణుగూరు ,డిసెంబర్13 వై 7 న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ముత్యాలమ్మ నగర్ గ్రామపంచాయితీ కార్యాలయంలో ప్రభుత్వ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని పలు సమస్యలపై చర్చించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.గ్రామపంచాయితీ లొ విద్య వైద్యం ఇరిగేషన్ ఫారెస్ట్ ఎలక్ట్రికల్ అగ్రికల్చర్ రెవిన్యూ ఇలా అన్ని శాఖల అధికారులతో ప్రజల సమస్యల గురించి గ్రామస్తుల సమక్షంలో అన్ని శాఖల ప్రభుత్వ అధికారులతో సమీక్ష సమావేశం జరిపి గ్రామస్తుల సమస్యలు తెలుసుకుని ఆయా శాఖల అధికారులకు సంబందించిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం గ్రామంలో నివసించే ఐదుగురు వికలాంగులకు ఒక్కొక్కరికి 50 వేల రూపాయలు చెక్కును ఆర్థిక సహాయంగా అందించారు అనంతరం గ్రామస్తులు పలు సమస్యలపై ఎమ్మెల్యే కి వినతి పత్రాన్ని అందజేశారు తక్షణమే సమస్యలను పరిష్కరిస్తామని పాయం వెంకటేశ్వర్లు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు,మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్ , మాజీ ఉపసర్పంచ్ లు,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళా నాయకులు కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.