E-PAPER

రాజ్యాంగ విరుద్ధంగా ఎస్ సి, ఎస్ టి వర్గీకరణ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మానుకోవాలి

దళితుల్ని విభజించి పాలించడం మానుకోవాలి

మెదక్ జిల్లా కు చేరుకున్న మాలాల మహా పాదయాత్ర

ఘనంగా స్వాగతం పలికిన నాయకులు

తూప్రాన్, నవంబర్, 24. వై సెవెన్ న్యూస్

రాజ్యాంగ విరుద్ధంగా ఎస్ సి, ఎస్ టి వర్గీకరణ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మానుకోవాలని మాల మహనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనిగిరి రవికుమార్, సామల అశోక్ కుమార్ లు పేర్కొన్నారు. ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ నాయకత్వంలో మెదక్ జిల్లాకు చేరుకున్న మాలల మహా పాదయాత్ర ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితుల్ని విభజించి పాలించడం మానుకోవాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 25న భద్రాచలం నుండి ప్రారంభమైన మాలల మహా పాదయాత్ర 38 రోజుల పాటు వెయ్యి కిలోమీటర్లు, 16 జిల్లాలు, 35 నియోజక వర్గాలు మీదుగా డిసెంబర్ 1 న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదారాబాద్ చేరుకొని అక్కడ మాలల మహా సంగ్రామ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. అగ్ర కులాల ఆధిపత్యం కోసం, రాజ్యాధికారం నుండి దూరం చేయాలని దుర్బుద్ధితో విభజించి పాలించాలనుకోవడం మూర్ఖత్వం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ తోపాటు అద్దంకి దయాకర్, భైరీ రమేష్, సిద్దంతుల కొండబాబు, బత్తుల లింగం, మన్నె బాబురావు, అశోధ భాస్కర్, ధార సత్యం, గోలి సైదులు, కనిగిరి రవి కుమార్, సామల అశోక్ కుమార్,మామిడి వెంకటేష్, ఏర్పుల రాంప్రసాద్,దొంతి రాజు, ప్రవీణ్ కుమార్, మన్నే శ్రీనివాస్, అనిల్ కుమార్, పసుల నర్సింగ్ రావు, మరాఠి రాజు, జోగారి యాదగిరి, అంబేడ్కర్ సంగం అధ్యక్షులు పసుల నర్సింగరావు, మున్సిపల్ కౌన్సిలర్లు మామిడి వెంకటేష్, భైరం సత్య లింగం, మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామల అశోక్ కుమార్, నాయకులు, ఎర్పుల లక్ష్మణ్, కొరబోయిన ప్రవీణ్ కుమార్,దొంతి రాజేశ్వర్, పర్స ప్రభాకర్, చిట్టిమిళ్ల సత్యం, పర్స పోచేందర్, చిట్టిమిళ్ల అనిల్ కుమార్, ఎర్పుల రామ్ ప్రసాద్, ఎర్పుల బాల్ రాజ్, సాయి ప్రసాద్, శాస నాగేంద్ర ప్రసాద్, చిట్టిమిళ్ల బాలు, నవీన్ కుమార్, నర్సాపురం నాగ రాజు, ప్రసాద్, స్వామి లు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్