మంగపేట,నవంబర్24 వై 7 న్యూస్;
ములుగు జిల్లా, మంగపేట మండలం, కమలాపురం గ్రామానికి చెందిన భూక్య విగ్నేశ్వర్ అనే చిన్నారికి ప్లేట్ లెట్స్ పడిపోయాయి. 17 వేలే ఉన్నాయి. వారి కుటుంబ సభ్యులు అబ్బాయిని మొదట హన్మకొండలోని అమృత హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు సీరియస్ గా ఉందని చెప్పగా అక్కడినుంచి హైదరాబాద్ లోని లిటిల్ స్టార్స్ అండ్ షీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. వీరు చాలా బీదవారు.ఇప్పటికే చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి. వారి దగ్గర డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతూ దాతల సహాయం కోరగా జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ వారు వారి వాట్సాప్ గ్రూప్ లో వీరి పరిస్థితి గురించి వివరించగా ఆ గ్రూప్ లో ఉండే వారు కొంతమంది దాతలు భూక్య దీపికకు సుమారుగా పదివేల రూపాయల వరకు పంపించగా అలాగే వరంగల్ కి చెందిన యువనేతాజీ ఫౌండేషన్ సభ్యులు ప్రభుత్వ ఉపాధ్యాయులు గజ్జెల సుమన్ మరియు సేవ్ ద చిల్డ్రన్ ఫౌండేషన్ వారి తరుపున 6200 రూపాయలను ఈ రోజు జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారికి అందజేయడం జరిగింది. ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్ మాట్లాడుతూ విషయం తెలుపగానే వీరికి సహాయం అందించి వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్ , ఉపాధ్యక్షులు కస్ప ముకుందం , కోశాధికారి కొండపర్తి నగేష్ , గౌరవసలహాదారులు బండపల్లి రవి , సయ్యద్ బాబా పాల్గొన్నారు









