అనపర్తి,నవంబర్ 16 వై7 న్యూస్ ప్రతినిధి ;
అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి చొరవతో అనపర్తి నియోజక వర్గానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో పాడైన రోడ్డుల మరమ్మాతులకు నిధుల పర్వం కొనసాగుతోంది. అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి ఆర్&బి రోడ్డుల విషయంలో ప్రత్యేక శ్రద్ద వహించి, ఉమ్మడి కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్డుల మరమ్మత్తులకు శ్రీకారం నల్లమిల్లి చుట్టారు. మరమ్మత్తులకు గాను గతంలో 2.50 కొట్లు ప్రభుత్వం నుంది మంజూరు చేయించుకొని పనులు ప్రారంభించారు. ఇప్పుడు మరల అదనoగా కోటి 77 లక్షల రూపాయలు నిధులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రభుత్వం నుండి మంజూరు చేయించు కోవడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్బంగా రోడ్లు మరమ్మత్తులకు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి, ఆర్ &బి శాఖ మంత్రివర్యులు శ్రీ జనార్దన్ రెడ్డికి అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.