అనపర్తి,నవంబర్ 16 వై7 న్యూస్ ప్రతినిధి ;
అండర్ 17 బాల్ బాడ్మింటన్ స్టేట్ టీం కు జిబిఆర్ జూనియర్ కాలేజీ విద్యార్థి విషినిగిరి హేమంత్ దుర్గ ఎంపిక అయ్యాడు. నవంబర్ 9,10 తేదీల్లో రాజమహేంద్రవరం ఎస్కేవిటీ డిగ్రీ కాలేజీ లో జరిగిన 68 వ సారి ఎస్జిఎఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాల్ బాడ్మింటన్ ఛాంపియన్షిప్ నందు ఈస్ట్ గోదావరి టీం తరుపున ఉత్తమ ప్రదర్శన కనపర్చి బెస్ట్ ప్లేయర్ అవార్డు గెలుచుకున్నాడు. దానితో పాటు స్టేట్ టీమ్ కు కూడా ఎపింపిక అయ్యాడు.. సెలక్ట్ అయిన విద్యార్థికి కళాశాల కరెస్పాడెంట్ తేతలి ఆదిరెడ్డి (కొండబాబు), గవర్నింగ్ బాడీ మెంబెర్ శ్రీ రామారెడ్డి, ప్రిన్సిపాల్ స్వామి, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ అభ్బాయిరెడ్డి, అధ్యాపక అధ్యాపేకతర సిబ్బంది విద్యార్థిని అభినందిచారు. సెలక్ట్ అయిన విషయాన్ని కళాశాల డైరెక్టర్స్ రామారెడ్డి మహేంద్ర , డేవిడ్ రాజు , విజయ్ బర్న తదితరులు బాడ్మింటన్ లో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆశాభావం వ్యక్తం చేశారు.