E-PAPER

సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించిన పోచారం

బాన్సువాడ నవంబర్ 14 వై సెవెన్ న్యూస్ తెలుగు

బాన్సువాడ నియోజకవర్గంలోని
సిద్దాపూర్ రిజర్వాయర్ ను ఉద్దేశించి పోచారం మాట్లాడుతూ రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఉద్ధేశించి మాట్లాడారు.
బాన్సువాడ నియోజకవర్గం ప్రధానంగా వ్యవసాయ ఆధారితం అని
నియోజకవర్గంలో 70,670 కుటుంబాలు ఉంటే అందులో 66,670 మంది రైతులు అంటే 90 శాతం రైతు కుటుంబాలు వున్నాయని
బాన్సువాడ నియోజకవర్గంలో మొత్తం లక్షా యాబై వేల ఎకరాల సాగు భూమి ఉన్నదని,
ఇందులో లక్ష ఎకరాలు నిజాంసాగర్ ఆయకట్టులో ఉన్నదని అన్నారు.
సిద్ధాపూర్ రిజర్వాయర్ నా ఆశయం, ఈ ప్రాంతంలోని 14,000 ఎకరాల మెట్ట భూములకు పుష్కలంగా నీళ్ళు అందాలని ఆర్ధికంగా రైతులు స్థిరపడాలని నా కల అని
భవిష్యత్తులో సిద్ధాపూర్ రిజర్వాయర్ అయకట్టు సస్యశ్యామలంగా ఉండాలి అనేది నా ఉద్దేశ్యం అని తెలిపారు.రూ. 200 కోట్ల రూపాయల వ్యయంతో, ఒక టిఏంసి కెపాసిటీ తో నిర్మిస్తున్నాం అని రిజర్వాయర్ కట్టతో పాటుగా పొలాలకు నీళ్ళందించే కుడి, ఎడమ కాలువల పని కూడా త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు.
భవిష్యత్తు తరాల రైతులు సాగునీటికి ఇబ్బందులు లేకుండా పంటలు పండించుకోవాలంటే గిరిజనులు, మెట్ట ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని కష్టపడి సిద్దాపూర్ రిజర్వాయర్ కట్టిస్తున్నామన్నామని అధికారుల సమావేశంలో తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News