సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు దూలం శ్రీనివాస్
శ్రీరాంపూర్,అక్టోబర్21 వై 7న్యూస్;
శ్రీరాంపూర్ డివిజన్ పరిధిలో బెల్లంపల్లి రీజినల్ క్వాలిటీ జిఎం అల్లి రాజేశ్వర్ వద్ద కన్వియన్స్ డ్రైవర్ గా అత్తర్ హుస్సేన్ అనే కాంట్రాక్టు డ్రైవర్ విధులు నిర్వహించేవాడు.క్వాలిటీ జియం తన ఇంటి పని చేయడం లేదని, తన వ్యక్తిగత అవసరాల కొరకు వాహనాన్ని వాడుకొని, ఆ లెక్కలను బిల్లులలో పెట్టని కారణంగా , విధుల నుండి తొలగించాడు. ఆ కార్మికుడికి మద్దతుగా నిలిచిన నాయకులపై, డ్రైవర్ పై 2023 మార్చిలో తప్పుడు కేసు బనాయించడం జరిగింది. కేసుకు సంబంధించి సోమవారం కోర్టు వాయిదాకు రావడం జరిగింది. ఈ సందర్భంగా దూలం శ్రీనివాస్ సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ..సింగరేణిలో ఎక్కడలేని విధంగా శ్రీరాంపూర్ డివిజన్ పరిధిలో క్వాలిటీ జిఎం అల్లి రాజేశ్వర్ ఒక డ్రైవర్ పై తప్పుడు కేసు బనాయించడం ఇది సంస్థ మనుగడకే ఒక మాయని మచ్చ లాంటిదని అన్నారు. ఇంటి పని చేయడం లేదని, తప్పుడు బిల్లులు పెట్టడం లేదని విధుల నుండి తొలగించడం కంటే దుర్మార్గమైన చర్య మరొకటి ఉండదని, అధికారం, డబ్బుంటే ఏదైనా చేయొచ్చు అనే అహంకారంతో ఒక కుటుంబాన్ని రోడ్డు మీద పడేయడమే కాకుండా, తప్పుడు కేసు బనాయించి కోర్టు చుట్టూ తిరిగేలా చేశాడ న్నారు. దీనిపైన సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలు చేస్తే దీనిపై పూర్తి విచారణ చేయడానికి కొత్తగూడెం నుంచి అధికారులు సైతం వచ్చి విచారణ చేశారని గుర్తుచేశారు. విచారణ చేసిన సింగరేణి యాజమాన్యం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని, తాను చేసిన తప్పుడు బిల్లుల బాగోతం, కార్మికున్ని మానసికంగా ఇబ్బందులకు గురి చేసి, తన ఇంటి పనులకు వాడుకున్నాడనే పూర్తి సమాచారాలను డైరెక్టర్ల విచారణలో తేలినప్పటికీ ఎందుకు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు?. అదే ఓ సాధారణ కార్మికుడు చిన్నతప్పిదం చేస్తే కఠినంగా పనిష్మెంటు ఇచ్చే యాజమాన్యం. ఒక కార్మికుని పై కక్ష్య సాధింపు చర్యలు చేసి సంస్థకు వ్యతిరేకంగా ఒక కార్మికునిపై తప్పుడు కేసు బనాయిస్తే, ఆధారాలతో సహా నిరూపించిన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. అధికారులకు ఒక న్యాయం కార్మికులకు ఒక న్యాయమా? అని ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం స్పందించి సంస్థ మనుగడకే ఓ కలంకం తెచ్చిన క్వాలిటీ జిఎం పైన తగిన చర్యలు తీసుకోవాలని పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని,లేనియెడల మొత్తం కాంట్రాక్టు కార్మికులందరికీ విషయాన్ని తెలియజేసి పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలకు సైతం సిద్దమవుతామని కాంట్రాక్టు కార్మిక సంఘం సిఐటియుగా హెచ్చరించారు.









