E-PAPER

బెల్లంపల్లిలో అట్టహాసంగా 76వ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలు

బెల్లంపల్లి, సెప్టెంబర్ 15 వై 7 న్యూస్;

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బాశెట్టి గంగారం విజ్ఞాన్ భవన్ సిపిఐ ఆఫీస్ నందు భారత కమ్యూనిస్టు పార్టీ, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి ఆధ్వర్యంలో ఈనెల 11 తేదీ నుండి 17వ తేదీ వరకు నిర్వహించే 76వ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను ఘనంగా జరుపుకుంటూ ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ నాయకులు కూడలిలో గల భగత్ సింగ్ స్తూపం వద్ద గల జెండా ను సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ,బెల్లంపల్లి పట్టణ కార్యాలయంలో గల జెండాను జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ , రైల్వే స్టేషన్లో గల జెండాను ఏఐటియుసి సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ మిట్టపల్లి వెంకట్ స్వామి,స్టేషన్ రోడ్ కాలనీలో గల జెండాను జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య ఆవిష్కరించినారు, పతావిష్కరణ తదనంతరం అమరవీరులకు స్థూపానికి నివాళులర్పించినారు, మీడియా సమావేశంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ ఆనాడు సుమారు 4,500 మంది కమ్యూనిస్టులు తమ ప్రాణాలర్పించి తెలంగాణను, నైజం నవాబుల నుండి విముక్తి చేసారని ,ఆనాడు జరిగిన ఉద్యమంలో ఎలాంటి పాత్ర పోషించని బిజెపి తెలంగాణ సాయుధ పోరాటానికి హిందూ ముస్లిం మధ్య వైరంగా చిత్రీకరిస్తూ చరిత్రను తప్పుదారి పట్టిస్తుందన్నారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందని వారు తెలియజేసినారు.తదనంతరం సిపిఐ మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ దున్నే వాడికె భూమి కావాలని భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరీ విముక్తి కోసం కాళ్ళు మొక్కుతా బాంచన్ దొర అనే చేతులే బంధుక్ లు పట్టి భరిషలు చేతబట్టి 3000 గ్రామాలను విముక్తి చేసి పది లక్షల ఎకరాలను పేదలకు పంచిన ఘనత సిపిఐ కమ్యూనిస్టు పార్టీదని , తద్వారా నైజం నవాబులు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి లొంగిపోవడం ద్వారా తెలంగాణకు విముక్తి లభించిందని వారన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని వారు కోరినారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ, పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి, బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, మందమర్రి పట్టణ కార్యదర్శి దుర్గరాజు, ఏఐకేఎస్ జాతీయ సమితి సభ్యులు అక్కపల్లి బాపు, జిల్లా కార్యదర్శి కొండుబానేష్,డిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు డి ఆర్ శ్రీధర్, మరియు పట్టణ సహాయ కార్యదర్శి బియ్యాల ఉపేందర్ ఏఐవైఎఫ్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్ ఏఐటీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షులు బియ్యాల వెంకట్ స్వామి, బ్రాంచ్ సహాయ కార్యదర్శి తిరుపతి గౌడ్, కాసిపేట ఫిట్ కార్యదర్శి మీనుగు లక్ష్మీనారాయణ,మేకల రాజేశం, రత్నం ఐలన్న, బొంకూరి రామచందర్, రత్నం రాజం, మంతెన రమేష్, నాగేశ్వర్, పుట్ట శ్రీను, నంది అన్వేష్, తదితరులు పాల్గొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News