. పనులను పరిశీలించిన ఇరిగేషన్ శాఖ ఎస్ ఈ, కాంగ్రెస్ పార్టీ నాయకులు
కరకగూడెం,సెప్టెంబర్ 02 వై 7న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని కరకగూడెం, చిరుమళ్ళ గ్రామాల మధ్యలో ఉన్న పెద్ద వాగు బ్రిడ్జి అధిక వర్షాల వలన పెద్దవాగు వరద ప్రవాహం పెరగడంతో కోతకు గురైంది. ఈ సందర్భంగా పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు ఇరిగేషన్ శాఖ ఎస్ ఈ వెంకటేశ్వర రెడ్డి బ్రిడ్జిని పరిశీలించి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా కోతకు గురైన ప్రాంతంలో ఎర్రమట్టి గ్రావెల్ తో తాత్కాలిక మరమ్మతులు నిర్వహిస్తున్నారు..
ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులతో పాటు బ్రిడ్జి వద్ద మరమ్మతులు జరిగే ప్రాంతాన్ని పరిశీలించిన కాంగ్రస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
అనంతరం వారు మాట్లాడుతూ ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా కోతకు గురైన పెద్దవాగు బ్రిడ్జికి తాత్కాలిక మరమ్మతులకు చొరవ చూపిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు..
ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు,టిడిపి రాష్ట్ర నాయకులు చందా మధు , మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్ర సురేష్, బిజెపి పార్టీ నాయకులు బైరిశెట్టి వెంకన్న, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..